ఎన్‌కౌంటర్‌లో నలుగురు తీవ్రవాదుల హతం

Security Forces Kill Four Militants In Anantnag District Of Jammu And Kashmir - Sakshi

అనంత్‌నాగ్‌ : జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని ఆదివారం భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు తీవ్రవాదులను హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. జిల్లాలోని డయాల్‌గామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిర్థిష్ట సమాచారంతోనే ఆదివారం ఉదయం భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. తర్వాత ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు తమ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురుచూస్తున్నామని అధికారి తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top