బాబ్రి కేసు: ఆ నివేదిక కోరిన సుప్రీం | SC Asks Lucknow Ssessions Judge To Subimit Report On Babri Case | Sakshi
Sakshi News home page

బాబ్రి కేసు : సెషన్స్‌ కోర్టు నివేదిక కోరిన సుప్రీం

Sep 10 2018 3:14 PM | Updated on Sep 10 2018 4:45 PM

SC Asks Lucknow Ssessions Judge To Subimit Report On Babri Case - Sakshi

విచారణ ఎప్పుడు ముగిస్తారు..?

సాక్షి, న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను ఎప్పటిలోగా ముగిస్తారో తెలపాలని లక్నో సెషన్స్‌ జడ్జిని సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది. బాబ్రీ కేసు విచారణపై కాలపరిమితిని పేర్కొంటూ సీల్డ్‌ కవర్‌లో తెలపాలని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రతో కూడిన సుప్రీం బెంచ్‌ లక్నో సెషన్స్‌ జడ్జిని కోరింది. మరోవైపు ఇదే కేసులో విచారణను ముగించాలన్న సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో తన ప్రమోషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు నిలిపివేయడంపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌ అప్పీల్‌పై యూపీ ప్రభుత్వ స్పందనను కోరుతూ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

1992 బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి సహా 14 మందిపై గత ఏడాది ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు అభియోగాలను అనుమతించింది. అయోధ్య కేసులో అద్వానీ, జోషీ, ఉమాభారతిలను నేరపూరిత కుట్ర నేరం కింద ప్రాసిక్యూట్‌ చేయవచ్చని, త్వరితగతిన విచారణ చేపట్టి ఏప్రిల్‌ 19, 2019 నాటికి విచారణ ముగించాలని ప్రత్యేక న్యాయస్ధానాన్ని కోరింది. పూర్తి విచారణ ముగిసేవరకూ న్యాయమూర్తి బదిలీని చేపట్టరాదని, విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement