శశికళ భర్తకు సీరియస్? | Sasikala Husband Natarajan Condition Critical | Sakshi
Sakshi News home page

Mar 18 2018 8:23 AM | Updated on Mar 18 2018 8:23 AM

Sasikala Husband Natarajan Condition Critical - Sakshi

సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ భర్త నటరాజన్‌ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

శనివారం సాయంత్రం ఆయనకు ఛాతీ నొప్పి రాగా.. చెన్నైలోని గ్లోబల్‌ హెల్త్‌ సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని.. ఆరోగ్యంపై ఇప్పుడే ఏం చెప్పలేమని వైద్యులు వెల్లడించారు.  పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ భర్త అనారోగ్యం వార్త అందుకోగానే హుటాహుటిన పెరోల్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు సమచారం. 

కాగా, 74 ఏళ్ల నటరాజన్‌ లివర్‌ సంబంధిత వ్యాధితో గతంలోనూ అస్వస్థతకు గురికాగా.. శశికళ పెరోల్‌పై బయటకు వచ్చారు. అయితే ఆమె అప్పుడు భర్త కోసం కంటే రాజకీయాల పైనే ఎక్కువ దృష్టిసారించారన్న ఆరోపణలు వినిపించాయి. 

Advertisement
 
Advertisement
Advertisement