'ఆ డాక్యుమెంటరీ తీయడం నా కల' | Sapna Bavnani Writes To Imran Khan, It Is My Dream To Complete Sindusthan Documentary | Sakshi
Sakshi News home page

'ఆ డాక్యుమెంటరీ తీయడం నా కల'

Jul 24 2019 3:23 PM | Updated on Jul 24 2019 4:09 PM

Sapna Bavnani  Writes To Imran Khan, It Is My Dream To Complete Sindusthan Documentary - Sakshi

ముంబయి : ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ సప్నా భవ్నాని 'సింధుస్థాన్‌' పేరుతో తీస్తున్న డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని 'సింధ్‌‌' రాష్ట్రానికి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఆమె మంగళవారం కోరారు.

'ఇమ్రాన్‌ సార్‌ ! నేను సింధ్‌ పేరు మీద సింధుస్థాన్‌ అనే డాక్యుమెంటరీ తీస్తున్నాను. ఈ డాక్యుమెంటరీకి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకునేందుకు సింధ్‌కు రావాలనుకున్నాను. అయితే రెండుసార్లు నా వీసా తిరస్కరణకు గురైంది. ఈ సినిమా చేయడం నా కల.. ఎలాగైనా ఈ డాక్యుమెంటరీని పూర్తి చేయడానికి మీరు సహృదయంతో ఆలోచించి నాకు అనుమతినిస్తారని ఆశిస్తున్నా’అని స్వప్నా భవ్నానీ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా ఆమె చేసిన ట్వీట్‌పై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. సింధ్‌ చరిత్ర, సంసృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 'సింధుస్థాన్‌' డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement