మోసపోయిన మన్మోహన్ మాజీ సలహాదారు

Sanjaya baru cheated online after order for liquor - Sakshi

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్​కు మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్‌ బారు ఆన్​లైన్ మోసానికి గురయ్యారు. మద్యం పేరుతో ఓ వ్యక్తి తన నుంచి 24 వేల రూపాయలు తీసుకుని మోసం చేశారన్న ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం నిందితుడిని అరెస్టు చేశారు.

లాక్​డౌన్​ కాలంలో సంజయ్‌ బారు మద్యం కోసం ఆన్​లైన్​లో వెతికారు. ఆయనకు లా కేవ్ వైన్స్ అండ్​ స్పిరిట్స్ అనే షాపు మద్యం సరఫరా చేస్తున్నట్లు కనిపించింది. అందుబాటులో ఉన్న మొబైల్​ నంబర్​ కు ఫోన్ చేయగా, సదరు వ్యక్తి 24 వేల రూపాయలు ఆన్​లైన్​లో పంపాలని డిమాండ్ చేశారు. డబ్బులు పంపిన సంజయ్‌ బారు, మళ్లీ ఫోన్ చేయగా స్విచాఫ్ వస్తుండటంతో పోలీసులను ఆశ్రయించారు.(‘ప్రధాని ప్రశంసించారు.. అది చాలు’)

మొబైల్​ నెంబరు ట్రేస్ చేసిన పోలీసులకు నిందితుడు ఓ క్యాబ్​ డ్రైవర్​ అని తెలిసింది. అతన్ని అరెస్టు చేసి విచారించగా వాళ్లు ఓ ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించాడు. పలు రకాల సిమ్​ కార్డులు, నకిలీ పేర్లు, అడ్రెస్సులు వాడుతూ టార్గెట్ చేసిన వ్యక్తులకు ఫోన్లు చేస్తామని తెలిపాడు. (బైక్‌పై చీఫ్‌ జస్టిస్ చక్కర్లు; ఫోటోలు వైరల్‌)

తమకు వేర్వేరు రాష్ట్రాల్లో బ్యాంకు అకౌంట్లు కూడా ఉన్నాయని నిందితుడు వెల్లడించాడు. బాధితులు ట్రాన్స్​ఫర్ చేసిన ఐదు నుంచి పది నిమిషాల్లో డబ్బు వేరే రాష్ట్రాల్లోని అకౌంట్లకు అక్కడి నుంచి అసలు ఖాతాలకు బదిలీ అవుతుందని వివరించాడు. పోలీసులకు అంతుచిక్కకుండా ఉండేందుకు రకరకాల ప్లాన్స్ గీస్తామని చెప్పాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top