రాష్ట్రపతిగా సేన ఛాయిస్‌ ఆ నేతే..

 Sanjay Raut Says Sharad Pawars Name Should Be Considered For Presidents Post - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2022లో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలూ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ పేరును పరిగణనలోకి తీసుకోవాలని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ కోరారు. రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు అవసరమైన సంఖ్యా బలం 2022 నాటికి తమకు సమకూరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్‌ కూటమి సర్కార్‌ ఏర్పాటులో పవార్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దేశంలోనే సీనియల్‌ నేత శరద్‌ పవార్‌ పేరును రాష్ట్రపతి పదవికి అన్ని రాజకీయ పార్టీలూ పరిశీలించాలని ఈ సందర్భంగా రౌత్‌ విజ్ఞప్తి చేశారు. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కార్‌లో పవార్‌ సారథ్యంలోని ఎన్సీపీ హోం, ఆర్థిక వంటి పలు కీలక శాఖలను దక్కించుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top