సెల్యూట్‌ విజయన్‌.. పెరియార్‌ కల నిజం చేశావు! | Salute to Kerala CM Pinarayi Vijayan, says Kamal Haasan‏ | Sakshi
Sakshi News home page

సెల్యూట్‌ విజయన్‌.. పెరియార్‌ కల నిజం చేశావు!

Oct 9 2017 9:28 AM | Updated on Oct 9 2017 11:55 AM

Salute to Kerala CM Pinarayi Vijayan, says  Kamal Haasan‏

ట్రావన్‌కోర్‌ ఆలయ బోర్డు.. ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: ఆరుగురు దళితులు సహా మొత్తం 36మంది బ్రాహ్మణేతరులను దేవాలయ పూజారులుగా నియమిస్తూ ఇటీవల కేరళకు చెందిన ట్రావన్‌కోర్‌ దేవస్థానం నియామక బోర్డు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ట్రావన్‌కోర్‌ ఆలయ బోర్డు (టీడీబీ) గతంలోనూ బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించినప్పటికీ.. దళితులను పూజారులుగా నియమించడం ఇదే తొలిసారి.

మొత్తం 62 మంది పూజారులను తాజాగా టీడీబీ నియమించగా.. అందులో 36మంది బ్రాహ్మణేతరులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా రిజర్వేషన్‌ వర్తింపజేస్తూ.. రాష్ట్ర పబ్లిక్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా పూజారి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. మొత్తం 62 పోస్టుల్లో 26మంది బ్రాహ్మణులు పూజారులుగా ఎంపికయ్యారు.

కేరళ సర్కారు తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయంపై ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు. 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించిన ట్రావన్‌కోర్‌ ఆలయ బోర్డ్‌ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కమల్‌ హాసన్‌ సెల్యూట్‌ అర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement