గూగుల్ సెర్చ్ టాప్‌లో సల్మాన్, సన్నిలియోన్‌లు | Salman Khan, Sunny Leone's in the top of Google search | Sakshi
Sakshi News home page

గూగుల్ సెర్చ్ టాప్‌లో వాళ్లిద్దరూ

Jul 16 2016 8:47 AM | Updated on Sep 4 2017 4:56 AM

గూగుల్ సెర్చ్ టాప్‌లో సల్మాన్, సన్నిలియోన్‌లు

గూగుల్ సెర్చ్ టాప్‌లో సల్మాన్, సన్నిలియోన్‌లు

గత దశాబ్ద కాలంలో గూగుల్ ఎక్కువగా వెదికిన భారతీయ నటీ నటులుగా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, సన్నీలియోన్‌లు మొదటిస్థానం దక్కించుకున్నారు.

ముంబై : గత దశాబ్ద కాలంలో గూగుల్ ఎక్కువగా వెదికిన భారతీయ నటీ నటులుగా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, సన్నీలియోన్‌లు మొదటిస్థానం దక్కించుకున్నారు. సల్మాన్ తర్వాత షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్‌లు మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, రణ్‌బీర్ కపూర్, ఆమిర్ ఖాన్, ఇమ్రాన్ హష్మీలు టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నారు.

హీరోయిన్ల జాబితాలో సన్నీ తర్వాత కత్రినా కైఫ్, కరీనా కపూర్, కాజల్ అగర్వాల్, దీపికా పదుకునే, ఐశ్వర్య రాయ్, ప్రియాంకా చోప్రా, తమన్నా, అలియా భట్, సోనాక్షి సిన్హాలు గూగుల్ జాబితాలో నిలిచారు. క్లాసిక్ నటుల్లో అమితాబ్ బచ్చన్, రేఖలు మొదటి స్థానాల్లో నిలిచారు. అమితాబ్ తర్వాత కమల్ హాసన్, రాజేష్ ఖన్నా, మిథున్ చక్రవర్తి, రాజ్‌కుమార్, ధర్మేంద్ర తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement