చంద్రబాబుతో భేటీ అయిన సచిన్ | Sachin Tendulkar Met AP CM | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో భేటీ అయిన సచిన్

Dec 3 2016 4:35 PM | Updated on Aug 14 2018 11:26 AM

చంద్రబాబుతో భేటీ అయిన సచిన్ - Sakshi

చంద్రబాబుతో భేటీ అయిన సచిన్

క్రికెట్ దిగ్గజం,రాజ్యసభ ఎంపీ సచిన్ టెండూల్కర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ ఎంపీ సచిన్ రమేష్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగే నాయకత్వ సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రిని సచిన్ కలిశారు. ఈ సందర్భంగా 15 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. తన దత్తత గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎంకు సచిన్ వివరించినట్లు సమాచారం. సచిన్ నెల్లూరు జిల్లాలోని మైన పుట్టంరాజువారి కండ్రిగగ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement