యూఎస్‌ మూన్‌ మిషన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

RSS Activist Said US Moon Mission Success Because of Ekadashi - Sakshi

న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ఆఖరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యావత్‌ దేశ ప్రజలు ఇస్రో శాస్త్రవేత్తలకు బాసటగా నిలిచారు. మీరు సాధించింది మామూలు విజయం కాదంటూ మద్దతు తెలిపారు. చంద్రయాన్‌-2 విఫలం కావడంతో మరోసారి అమెరికా మూన్‌ మిషన్‌ టాపిక్‌ తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ కార్యకర్త, సంచలనాలకు మారు పేరైన శంభాజీ భిఢే, అమెరికా మూన్‌ మిషన్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకాదశి రోజున ప్రయోగం నిర్వహించారు కాబట్టి అమెరికా మూన్‌ మిషన్‌ సక్సెస్‌ అయ్యిందన్నారు.

వివరాలు.. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న భిఢే మాట్లాడుతూ ‘అమెరికా 38 సార్లు మూన్ మిషన్ చేపట్టినా విజయవంతం కాలేదు. ఆ తరువాత అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు భారతీయ కాలమానాన్ని ఆశ్రయించారు. ఫలితంగా అమెరికా తన 39వ మూన్ మిషన్ ప్రయోగాన్ని ఏకాదశి తిథి రోజున నిర్వహించి విజయం సాధించింది’ అని అన్నారు. కాగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం భిడేకు కొత్త కాదు. గతంలో తన తోటలోని మామిడి పండ్లను తింటే మగపిల్లలు పుడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top