బ్యాంకు అధికారిపై దాడి.. లూటీ | Rs 5 lakh in Rs 2000 denomination notes looted from a bank employee | Sakshi
Sakshi News home page

బ్యాంకు అధికారిపై దాడి.. లూటీ

Dec 30 2016 3:13 PM | Updated on Sep 4 2017 11:58 PM

బ్యాంకు అధికారిని టార్గెట్‌గా చేసుకొని దోపిడీదారులు రెచ్చిపోయారు.

రాంచీ: జార్ఖండ్‌లో దోపిడీదారులు మరోసారి రెచ్చిపోయారు. గిరిద్‌ జిల్లాలో.. ఓ బ్యాంకు అధికారిని టార్గెట్‌ చేసి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ. 5 లక్షల విలువైన రెండువేల నోట్లను దుండగులు లూటీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదే ప్రాంతంలో ఇటీవల బ్యాంకు నుంచి డబ్బు విత్‌ డ్రా చేసుకుని వెళ్తున్న వర్తకుడిపై ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు దాడి చేసి రూ. 5 లక్షలు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల దుండగుల ఆగడాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement