ఇక రైలు మధ్యలో మహిళా బోగీలు | Rlys to place ladies coaches in centre, paint with new colour | Sakshi
Sakshi News home page

ఇక రైలు మధ్యలో మహిళా బోగీలు

May 5 2018 5:08 AM | Updated on Aug 14 2018 3:37 PM

Rlys to place ladies coaches in centre, paint with new colour - Sakshi

న్యూఢిల్లీ: మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన బోగీలను ఇక నుంచి రైలు చివరలో కాకుండా మధ్యలో ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ బోగీలను ప్రయాణికులు తేలికగా గుర్తించేందుకు ప్రత్యేకమైన రంగును వేయనున్నట్లు తెలిపింది.

రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతపై రైల్వే బోర్డు చైర్మన్‌  నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై తమ అభిప్రాయాలను తెలపాల్సిందిగా అన్ని రైల్వే జోన్లను కోరింది. మహిళా బోగీల్లోకి పురుషులు ప్రవేశించకుండా ఏర్పాటు చేయాలని సూచించింది. మహిళా బోగీల కిటికీలకు మెష్‌లు, బోగీల్లో సీసీ కెమెరాలను అమర్చాలని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement