'భారత్ హిందూ రాజ్యమే' | Remove secular, socialist from Constitution's preamble: Shiv Sena | Sakshi
Sakshi News home page

'భారత్ హిందూ రాజ్యమే'

Jan 28 2015 3:34 PM | Updated on Sep 2 2017 8:25 PM

'భారత్ హిందూ రాజ్యమే'

'భారత్ హిందూ రాజ్యమే'

భారత దేశం ఎప్పుడూ లౌకికదేశం కాదు, మనది హిందూ రాజ్యమే అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

న్యూ ఢిల్లీ: భారత దేశం ఎప్పుడూ లౌకికదేశం కాదు, మనది హిందూ రాజ్యమే అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చిన లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది.

కేంద్రప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా పత్రికలకి జారీ చేసిన ప్రకటనలో పాత పీఠికనే ప్రచురించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ప్రకటనలో పాత పీఠిక ప్రచురించడంతో లౌకిక, సామ్యవాద పదాలు కనిపించలేదు. పాత రాజ్యాంగ పీఠికను మాత్రమే పొరపాటున ఈ అడ్వర్టైజ్మెంట్లో వాడామని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి రాజవర్ధన్ రాథోడ్ వివరణ ఇచ్చారు. అయితే ఇది పొరపాటుకాదు, మంచిపని చేశారు..పాత రాజ్యాంగపీఠికనే అనుసరించండని శివసేన పార్టీ డిమాండ్ చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement