
రాష్ట్రపతి భవన్‌కు కోపమొచ్చింది..
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫొటో కాంగ్రెస్ పార్టీ హోర్డింగుల్లో దర్శనమివ్వడంపై రాష్ట్రపతి భవన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫొటో కాంగ్రెస్ పార్టీ హోర్డింగుల్లో దర్శనమివ్వడంపై రాష్ట్రపతి భవన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి డాక్టర్ నజీమ్ జైదీకి రాష్ట్రపతి భవన్ కార్యదర్శి ఓమితా పాల్ లేఖ రాశారు. ఈ లేఖలో ఏం పేర్కొన్నారంటే.. రెండు జాతీయ పత్రికల్లో కాంగ్రెస్ పార్టీ ప్లెక్సీల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫొటో ఉన్నట్లు పేర్కొన్నాయి.
వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలిసి దేశ అధ్యక్షుడి ఫొటోను వేసినట్లు తెలిసింది. ఈ ఫొటో విషయాన్ని ఇప్పటికే లుధియానా డిప్యూటీ కమిషనర్, జిల్లా ఎన్నికల నిర్వహణ అధికారి ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రపతి అన్ని పార్టీలకు అతీతం. రాజకీయ నాయకులకు అతీతం. ఆయనను ఏ పార్టీ కూడా తమ వ్యక్తిగా చెప్పుకోరాదు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఇకముందు ఇలాంటి చర్యలు జరగకుండా రాష్ట్రపతి పదవికున్న తటస్థతకు భంగం కలగకుండా చూడాలి' ఆ లేఖలో పేర్కొన్నారు. పంజాబ్‌లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన హోర్డింగుల్లో రాష్ట్రపతి ప్రణబ్ ఫొటోలు దర్శనమిచ్చాయి.