ఈ బావిలో నీళ్లు.. బాగా 'హాట్' గురూ..!

ఈ బావిలో నీళ్లు.. బాగా 'హాట్' గురూ..!


ఉదయ్ పూర్ (రాజస్థాన్): బావిలో నీళ్లు ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే! కానీ, వేడి నీళ్లు.. అది కూడా 58 డిగ్రీల సెల్సియస్ వేడితో దొరికితే.. ఆశ్చర్యమే కదా! సరిగ్గా ఇలాంటి బావి రాజస్థాన్ లోని బికార్డీ గ్రామంలోని ఓ పేద రైతు పొలంలో ఉంది. ఆ బావి గొప్పదనం గురించి పెద్దగా తెలియని ఆ బీద రైతు.. దానిలో నీళ్లను మోటారుతో తోడి, వాటిని చల్లార్చి పంట పండించడానికి వాడుకుంటున్నాడు.ఇప్పడు జియోలాజికల్ పరిశోధకులంతా ఈ బావి బాట పట్టారు. ఇంతకు మునుపెన్నడూ ఇలాంటి బావిని రాజస్థాన్ లో చూడలేదని వారు చెప్తున్నారు. 30 మీటర్ల లోతు గల ఈ బావి భూగర్భంలో నీటికి బాగా చేరువగా ఉండటం వల్ల అక్కడ వేడికి నీరు ప్రభావితం అవుతోందని చెప్తున్నారు. రాతిభాగంలో ఉండే అనేక రకాల రసాయనాలు కూడా ఈ నీటిలో ఉన్నాయని చెబుతున్నారు. అగ్ని పర్వతాలు లేని ప్రాంతం కావడంతో ఈ నీటిలో సల్ఫర్ చేరలేదని అంటున్నారు. ఈ బావిని టూరిస్ట్ స్పాట్ గా మార్చేలా రైతుకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top