రాష్ట్రపతి కోవింద్‌ నిర్ణయం.. తీవ్ర దుమారం

Ram Nath Kovind Decision on National Awards Presentation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌(72) తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 65వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానం వేడుక గురువారం సాయంత్రం విజ్ఞాన్‌ భవన్‌లో జరగనుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా విజేతలందరూ అవార్డులను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఈ కార్యక్రమానికి కోవింద్‌ గంట మాత్రమే అపాయింట్‌మెంట్‌ మాత్రమే ఇవ్వటంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు విజేతలు తాము ఈ కార్యక్రమాన్ని బహిష్కరించటం దుమారం రేపింది. 

ఈ ఏడాది మొత్తం 140 మంది అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే. ‘రాష్ట్రపతి గంట మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, కేటాయించిన సమయంలో 11 అవార్డులు మాత్రమే అందిస్తారని, మిగిలిన అవార్డులను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అందిస్తారని’ రాష్ట్రపతి కార్యాలయం.. నిర్వాహకులకు తెలిపింది. ఈ నిర్ణయంపై విజేతల్లో చాలా మంది అభ్యంతరం తెలిపారు. గతేడాది జరిగిన కార్యక్రమంలో  ప్రణబ్‌ ముఖర్జీ(82) ఎంతో ఓపికగా విజేతలకు అవార్డులను అందజేశారని.. అలాంటిది ఇప్పుడు కోవింద్‌కు వచ్చిన అభ్యంతరం ఏంటని కొందరు నిర్వాహకులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవార్డుల వేడుకను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అలాగని తాము అవార్డులను అగౌరవపరచటం లేదని వారు చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

వచ్చే ఏడాది నుంచి రాష్ట్రపతి కేవలం ఒకే ఒక్క అవార్డు మాత్రమే బహుకరిస్తారని, మిగతావి మంత్రులతో ప్రధానం చేయించాలని రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో కేంద్రానికి తెలియజేసింది. ఏప్రిల్‌ 13న ప్రకటించిన 65వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరణానంతరం దిగ్గజ నటుడు వినోద్‌ ఖన్నాకు దాదాసాహెచ్‌ పాల్కే అవార్డును.. నటి శ్రీదేవికి ఉత్తమ నటిగా మామ్‌ చిత్రానికి అవార్డులను ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top