నళినికి ఒక రోజు పెరోల్ | Rajiv Gandhi killer Nalini granted 24-hour parole to attend father's memorial | Sakshi
Sakshi News home page

నళినికి ఒక రోజు పెరోల్

Mar 8 2016 12:46 PM | Updated on Oct 8 2018 3:56 PM

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన దోషి నళిని శ్రీహరణ్కు పెరోల్ మంజూరైంది. 24గంటలపాటు ఆమె జైలు బయట ఉండేందుకు కోర్టు అనుమతించింది.

చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన దోషి నళిని శ్రీహరణ్కు పెరోల్ మంజూరైంది. 24గంటలపాటు ఆమె జైలు బయట ఉండేందుకు కోర్టు అనుమతించింది. తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మద్రాస్ కోర్టు ఆమెకు ఈ అవకాశం కల్పించింది. గత నెలలో చెన్నైలో ఆమె తండ్రి చనిపోవడంతో 12గంటల ఎమర్జెన్సీ పెరోల్పై ఆమెను విడుదల చేశారు.

కాగా, అంత్యక్రియల అనంతర కార్యక్రమాలకు మరోసారి హాజరయ్యేందుకు మూడు రోజులపాటు అనుమతించేలా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆమె మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆమెను గత 24 సంవత్సరాలుగా వెల్లోర్లోని ప్రత్యేక సెల్ లో ఉంచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా 24 సంవత్సరాలుగా జైలులో ఉంటున్న తనను సత్ప్రవర్తన కింద పరిగణించి విడిచిపెట్టాలని కూడా ఆమె గత డిసెంబర్లో కోర్టుకు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement