లవర్‌తో కలిసి మాజీ ప్రియుడిని.. | Rajasthan man murders girlfriend's ex-lover, threatens cops | Sakshi
Sakshi News home page

లవర్‌తో కలిసి మాజీ ప్రియుడిని..

Aug 12 2017 8:14 PM | Updated on Sep 11 2017 11:55 PM

ప్రియుడు, మాజీ ప్రియుడు, ప్రేయసిల ఓ రియల్‌ క్రైం కథ.

జైపూర్‌( రాజస్థాన్‌) :
ప్రియుడు, మాజీ ప్రియుడు, ప్రేయసిల ఓ రియల్‌ క్రైం కథ. ప్రేమ, మోసం, హత్య, బెదిరింపుల చుట్టూ తిరుగుతూ ఓ థ్రిల్లర్‌ సినిమాకు ఏమాత్రం తీసిపోని ఓ యదార్థ ఘటన. మాజీ ప్రియుడిని, ప్రస్తుత ప్రియుడి సహాయంతో హత్య చేసి పోలీసులకు చిక్కింది ఓ యువతి. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రియుడు తన ప్రియురాలినే అరెస్ట్‌ చేస్తారా అంటూ ఏకంగా పోలీసులనే బెదిరిస్తూ తప్పించుకు తిరుగుతూ వారిని ముప్పు తిప్పులు పెడుతున్నాడు.     


వివరాలు.. జూల్‌ 31న రాజస్థాన్‌లోని శ్రీ గంగేశ్వర టౌన్‌లోని నేతేవాలా బై పాస్‌ రోడ్డులో రనియా ప్రాంతానికి చెందిన వినోద్ బెనివల్‌ మృతదేహం లభించింది. అయితే ప్రాథమిక ఆధారాలను బట్టి వినోద్‌ బెనీవాల్‌ ది హత్యే అని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభించకపోయినా కేసు విచారణలో ఇందుబాల(23) అనే యువతి ప్రమేయమున్నట్టు తేలింది. మృతుడు ఇందుబాల మాజీ ప్రియుడు అని పోలీసుల విచారణలో తెలిసింది. అయితే  ప్రస్తుతం దీపక్‌ మాలిక్‌తో  పీకల్లోతు ప్రేమలో ఉన్న ఇందుబాల ఎలాగైనా వినోద్‌ బెనీవాల్‌ను అడ్డు తొలగించుకోవాలనుకుంది. దీంతో ప్రస్తుత ప్రియుడు దీపక్‌ మాలిక్‌తో కలిసి వినోద్‌ హత్యకు పక్క ప్రణాళిక రచించింది.

అనుకున్నట్టుగానే వినోద్‌ను ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించి మత్తుమందు కలిపిన ద్రావణాన్ని ఇచ్చింది. అనంతరం దీపక్‌ తన దగ్గరున్న గన్‌తో వినోద్‌ను కాల్చి చంపాడు. వినోద్‌ మృతదేహాన్ని రోడ్డుపై వేసి ఇందుబాల తన కారుతో తొక్కించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

ఈ కేసులో ఇందుబాలను ఆగష్టు 8న పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించగా హత్యలో ఆమె ప్రమేయమున్నట్టు ఒప్పుకుంది. అయితే ఈ కేసులో తన ప్రియురాలిని పోలీసులు ఆరెస్ట్‌ చేసి విచారిస్తున్నప్పటి నుంచి దీపక్ మాలిక్‌ ఫేస్‌బుక్‌ వేదికగా ఏకంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులను బెదిరించడం ప్రారంభించాడు. తన ప్రేయసితో పోలీసులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపిస్తూ.. వారి అంతు చూస్తానంటూ హెచ్చరించాడు.

ఢిల్లీ, ఘజియాబాద్‌, ఎన్‌సీఆర్‌ల నుంచి దీపక్ ఫేస్‌బుక్‌ పోస్టింగ్స్‌ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న దీపక్‌ తన లోకేషన్‌ను మార్చి ఫేస్ బుక్‌లో పోస్టింగ్స్‌ పెట్టే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. చుట్టు పక్కల రాష్ట్రాల్లో కూడా పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇందుబాల, దీపక్‌ల ఫేస్‌బుక్‌లను పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇద్దరూ తమ వద్ద ఉన్న గన్‌లను పబ్లిక్‌గా ఫేస్‌ బుక్‌లో షేర్‌ చేయడం చూసి పోలీసులే ఖంగుతిన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement