రైళ్లలో ధ్రువీకరణకు లాయర్‌ ఐడీ కార్డులు

Railways To Allow Bar Council-Issued Lawyer ID As Valid Proof For Travel - Sakshi

న్యూఢిల్లీ: రైలు ప్రయాణాల్లో గుర్తింపు ధ్రువీకరణ పత్రం(ఐడెంటిటీ ప్రూఫ్‌)గా న్యాయవాదులు తమకు ఆయా బార్‌ కౌన్సిల్స్‌ జారీ చేసే ఐడెంటిటీ కార్డులను ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకు 11 రకాల ధ్రువీకరణ పత్రాలను రైల్వే శాఖ గుర్తిస్తోంది. వాటిలో ఆధార్‌ కార్డ్, పాస్‌పోర్ట్, విద్యార్థులకు వారి పాఠశాలలు, కళాశాలలు జారీ చేసే గుర్తింపు కార్డ్‌లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే గుర్తింపు కార్డులు మొదలైనవి ఉన్నాయి. కేరళ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల కారణంగా బార్‌ కౌన్సిల్స్‌ జారీ చేసే ఐడీ కార్డులను ధ్రువీకరణ పత్రాలుగా ఉపయోగించుకునేందుకు అవకాశమిస్తున్నామని రైల్వే బోర్డు సోమవారం ప్రకటించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top