అద్భుతం.. ఆధునికం: ప్రధాని మోదీ | Railway budget - 2015 wonderful, says modi | Sakshi
Sakshi News home page

అద్భుతం.. ఆధునికం: ప్రధాని మోదీ

Feb 27 2015 1:38 AM | Updated on Aug 21 2018 9:33 PM

అద్భుతం.. ఆధునికం: ప్రధాని మోదీ - Sakshi

అద్భుతం.. ఆధునికం: ప్రధాని మోదీ

ప్రయాణికులు కేంద్రంగా రూపొందిన దార్శనిక బడ్జెట్ ఇది. అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలనూ స్పృశిస్తూ..

‘ప్రయాణికులు కేంద్రంగా రూపొందిన దార్శనిక బడ్జెట్ ఇది. అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలనూ స్పృశిస్తూ.. దేశ ప్రగతికి కీలక చోదక శక్తిగా రైల్వేలను నిలిపే మార్గసూచి ఇది. కొత్త రైళ్లను ప్రకటించే సాధారణ పద్ధతిలో కాకుండా రైల్వేలో సమగ్ర సంస్కరణల దిశగా సాగిన మేలిమలుపు ఈ బడ్జెట్.

ప్రయాణికులపై ఎలాంటి భారం మోపకుండా.. రూ. 8 లక్షల కోట్లను ఆధునీకరణకు, అభివృద్ధికి కేటాయించి స్పష్టమైన ప్రణాళికను, దార్శనికతను ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. రైల్వే బడ్జెట్ చరిత్రలో మొదటిసారి ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వేగం, సేవ, భద్రత.. వీటన్నింటినీ ఒకే ట్రాక్‌పై పెట్టి సామాన్యుడు లక్ష్యంగా రూపొందించారు. అవినీతిరహిత వ్యవస్థను రూపొందించే దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు ఈ బడ్జెట్.’

Advertisement
 
Advertisement
Advertisement