రాజకీయాల నుంచి రాహుల్ వైదొలగాలి: గుహ | Rahul Gandhi should retire, BJP will be hegemonic force for next 15-20 years: Ramachandra Guha | Sakshi
Sakshi News home page

రాజకీయాల నుంచి రాహుల్ వైదొలగాలి: గుహ

Sep 26 2016 3:15 AM | Updated on Sep 17 2018 5:18 PM

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజకీయాల నుంచి పదవీ విరమణ తీసుకోవాలని, పెళ్లి చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించాలని...

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజకీయాల నుంచి పదవీ విరమణ తీసుకోవాలని, పెళ్లి చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించాలని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. అదే అతనికి, భారత్‌కు కూడా మంచిదన్నారు. గుహ ఒక జాతీయ దినపత్రిక ఇంటర్వ్యూలో. నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్‌లు ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదుగుతారంటూ ప్రజలు భావించారని, కానీ వారు నిరాశపరుస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీని సవాలు చేసే జాతీయ నాయకుడి లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మరో రెండు దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో ప్రధాన శక్తిగా బీజేపీ చక్రం తిప్పుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement