కార్యకర్తలారా..మీరు ఏం చేస్తున్నారు.?

Rahul Gandhi Says,Where Are You Men When Mumbai Was Sinking - Sakshi

రాహుల్‌ గాంధీ

ముంబయి : ముంబయి నగరం భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంటే కాంగ్రెస్‌ కార్యకర్తలుగా ప్రజలకు రక్షణగా ఉండాల్సింది పోయి ఏం చేస్తున్నారని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. గతంలో జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్యతో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపించిన రాహుల్‌గాంధీపై ముంబయి లోకల్‌ కోర్టులో పరువునష్టం దాఖలైంది. దీనికి సంబంధించి కోర్టు నుంచి సమన్లు అందుకోవడానికి రాహుల్‌ గురువారం ముంబయికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ వాఖ్యలు చేయడం గమనార్హం.

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ట్విటర్‌లో పేర్కొన్న మర్నాడే రాహుల్‌ ముంబయికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.ముంబై విమానాశ్రయం నుంచి నేరుగా మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరైన రాహుల్‌ అటు నుంచి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గె, పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. మహరాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొత్తుల విషయం పక్కనబెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. తాను కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని, పార్టీకి కాదని వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top