అమేథీలో పర్యటించిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi Said I Will Fight for Amethi in Delhi - Sakshi

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలిసారి రాహుల్‌ గాంధీ అమేథీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అమేథీకి రావడం అంటే సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్‌. ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషకరం. ప్రస్తుతం నేను వయనాడ్‌ నుంచి గెలిచి ఉండవచ్చు. కానీ మూడు దశబ్దాలుగా అమేథీతో నాకు అనుబంధం ఉంది. అమేథీ  అభివృద్ధి కోసం ఢిల్లీలో పొరాడతాను’ అన్నారు.

తన పర్యటన సందర్భంగా రాహుల్‌ పార్టీ ప్రతినిధులను కలిశారు. సలోన్, అమేథీ, గౌరిగంజ్, జగదీశ్‌పూర్, తిలోయి అసెంబ్లీ నియోజకవర్గ బూత్‌ అధ్యక్షులను కలుసుకున్నారు. తన ఓటమి గురించి చర్చించారు. స్థానిక నాయకులు ప్రజలకు దూరంగా ఉండటం వల్లే తాను ఓడిపోయానన్నారు. అయితే నియోజకవర్గానికి, ఇక్కడ జరిగే కార్యక్రమాలకు తాను హాజరవుతానని రాహుల్‌ స్పష్టం చేశారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top