ఈ వీకెండ్‌ నానితో ఉంటా: రాహుల్‌ గాంధీ

Rahul Gandhi reveals Holi plan, to spend weekend with nani - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హోలీ వీకెండ్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ స్పెషల్‌ టూర్‌ ప్లాన్‌ చేశారు. ఇటలీలో ఉన్న అమ్మమ్మను సర్‌ప్రైజ్‌ చేసేందుకు అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. హోలీ వీకెండ్‌లో 93 ఏళ్ల నానిని సందర్శించి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఉందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. తన అమ్మమ్మ ఈ ప్రపంచంలోనే దయామయి అని కొనియాడారు. ఆమెను కలిసి ఆప్యాయంగా కౌగిలించుకోవాలనుందని.. అందరికీ హోలీ శుభాకాంక్షలంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

అంతకుముందు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపై కార్యకర్తలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. పాలక బీజేపీ ప్రజావ్యతిరేక విధానాల వల్లే ఆ పార్టీకి చుక్కెదురైందని..కాంగ్రెస్‌కు ఘనవిజయం దక్కిందని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేందుకు ఈ ఫలితాలు సంకేతమన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top