‘మీ డేటా అమెరికన్‌ కంపెనీలకు చేరవేస్తా’ | Rahul  Gandhis Latest Tweet On Prime Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

‘మీ డేటా అమెరికన్‌ కంపెనీలకు చేరవేస్తా’

Mar 25 2018 2:58 PM | Updated on Aug 25 2018 6:31 PM

Rahul  Gandhis Latest Tweet On Prime Minister Narendra Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నమో యాప్‌లో డేటా ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఈ వ్యవహరంలో ప్రధాన స్రవంతి మీడియా మౌనం దాల్చడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ‘ హాయ్‌..నా పేరు నరేంద్ర మోదీ..నేను భారత ప్రధానిని..మీరు నా అధికారిక యాప్‌కు సైనప్‌ అవగానే మీ డేటా అంతటిని నా సహచర అమెరికన్‌ కంపెనీలకు ఇచ్చేస్తా’నంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ’ఎప్పటిలానే ఇంతటి కీలక అంశాన్నీ మరుగునపరిచిన మీడియాకు థ్యాంక్స్‌’ అని రాహుల్‌ చురకలు వేశారు. ప్రధాని అధికారిక యాప్‌ డేటా ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఫ్రెంచ్‌ హ్యాకర్‌ ఎలియట్‌ అల్డర్సన్‌ వెల్లడించిన క్రమంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

నరేంద్ర మోదీ అండ్రాయిడ్‌ నమో యాప్‌ వ్యక్తిగత యూజర్ల సమాచారంపై రాజీపడుతోందని, యూజర్ల సమాచారాన్ని అమెరికన్‌ కంపెనీగా భావిస్తున్న ఇన్‌.డబ్ల్యూజడ్‌ఆర్‌కేటీ.కామ్‌కు చేరవేస్తోందని అల్డరన్స్‌ వరుస ట్వీట్లలో ఆరోపించారు. నమో యాప్‌లో మీ ప్రొఫైల్‌ క్రియేట్‌ అయిన వెంటనే మీ డివైజ్‌ సమాచారంతో పాటు వ్యక్తిగత డేటా మొత్తం మీ ఆమోదం లేకకుండానే అమెరికన్‌ సంస్థకు చేరుతోందని అల్డర్‌సన్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement