సెల్ఫీల కోసం పోటీ.. కొండచిలువ మృతి | Python Dies After Selfie Takers Poked It | Sakshi
Sakshi News home page

సెల్ఫీల కోసం పోటీ.. కొండచిలువ మృతి

Jul 5 2018 6:34 PM | Updated on Jul 5 2018 6:34 PM

Python Dies After Selfie Takers Poked It - Sakshi

కొండచిలువతో గ్రామస్థులు

ఆరడుగుల పొడవున్న కొండచిలువను సెల్ఫీల కోసం హింసించి..

కోల్‌కతా : సెల్ఫీల కోసం ఓ కొండచిలువ మృతికి గ్రామస్థులు కారణమయ్యారు. ఈ దారుణ సంఘటన బెంగాల్‌లోని బిర్‌భమ్‌ జిల్లా బాబీజోర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. దాదాపు ఆరడుగుల పొడవున్న కొండచిలువ హింగ్లో నది పరివాహక ప్రాంతంలో కొందరు వ్యక్తుల కంటపడింది. కొద్ది నిమిషాల్లోనే ఈ వార్త గ్రామం అంతటా వ్యాపించింది.

పెద్ద ఎత్తున ఆ ప్రదేశానికి చేరుకున్న గ్రామస్థులు కొండచిలువను పట్టుకుని గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం దానితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో ప్రజల పోటీ మధ్య కొండచిలువ నలిగిపోయింది. ఎటూ కదల్లేని స్థితిలోకి వెళ్లిపోయింది. అయినా అయినా కూడా కనికరం లేకుండా గ్రామస్థులు దాన్ని హింసించడంతో ప్రాణాలు వదిలింది.

ఈ ఘటనపై మాట్లాడిన అటవీ శాఖ అధికారులు కొండచిలువ మృతికి కారణమైన వారిని పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. నెల రోజుల క్రితం బెంగాల్‌లోనే సెల్ఫీల కోసం యత్నించి జాతీయ పక్షి నెమలి మృతికి కొందరు కారణమైన విషయం తెలిసిందే. అంతలోనే ఈ ఘటన జరగడం జంతువులు, పక్షుల రక్షణపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement