కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది: జీవిఎల్
కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందనడానికి జీకే వాసన్ ఘటన ఉదాహరణ అని బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహరావు అన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందనడానికి జీకే వాసన్ ఘటన ఉదాహరణ అని బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలపై సొంత నేతలే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.
హర్యానా ప్రయోజనాలు కాపాడే విధంగా బీఎస్ హుడా వ్యవహరించలేదని, బీజేపీని ప్రశ్నించడానికి ఆయనకు నైతిక హక్కులేదని నరసింహరావు అభిప్రాయపడ్డారు. భూకేటాయింపుల వ్యవహారంలో రాబర్ట్ వాద్రాకు సంబంధముందనే విషయాన్ని కాగ్ నివేదికలో వెల్లడైందని ఆయన తెలిపారు.
కేంద్రమాజీ మంత్రి, దివంగత నేత ముపనార్ కుమారుడు జీకే వాసన్ సోమవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తిరుచిలో జరిగే సభలో కొత్త పార్టీ పేరును ప్రకటిస్తామని జీకే వాసన్ తెలిపారు.