పనిమనిషి దగ్గర అప్పులు చేసిన ప్రత్యూష | Pratyusha had to borrow money from me, says maid | Sakshi
Sakshi News home page

పనిమనిషి దగ్గర అప్పులు చేసిన ప్రత్యూష

Apr 10 2016 12:21 PM | Updated on Nov 6 2018 7:56 PM

పనిమనిషి దగ్గర అప్పులు చేసిన ప్రత్యూష - Sakshi

పనిమనిషి దగ్గర అప్పులు చేసిన ప్రత్యూష

'బాలికా వధు' ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి.

ముంబై : 'బాలికా వధు' ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. తన ఇంట్లో పనిచేసే మహిళ రేణు సిన్హా నుంచి అప్పుడప్పుడు కొంత మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకునేదని వెల్లడయ్యింది. ప్రత్యూష, రాహుల్ల మధ్య సంబంధం గురించి పలు విషయాలను రేణు సిన్హా వెల్లడించింది.

మూడు నెలలుగా ప్రత్యూష ఇంట్లో తాను పని చేస్తున్నానని రేణు సిన్హా చెప్పింది. అప్పుడప్పుడు ప్రత్యూష క్యాబ్ చార్జీల కోసం, మందుల కోసం తన దగ్గర తక్కువ మొత్తంలో డబ్బు తీసుకుంటుండేదని తెలిపింది. ఆర్థిక పరమైన విషయాలన్నీ రాహుల్ చేతిలో ఉండేవని, ఆమె వద్ద ఖర్చుల నిమిత్తం కూడా పెద్దగా డబ్బు ఉండేది కాదని రేణు చెప్పింది. అప్పుడప్పుడు అర్ధరాత్రి సమయాల్లో వారి గది నుంచి అరుపులు వినబడుతుండేవని.. తరచూ ఇద్దరూ గొడవ పడుతుండేవారని ఆమె తెలిపింది.

చాలాసార్లు వారిని అడ్డుకోవాలని భావించానని.. అయితే వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకూడదనే ఆలోచనతో ఆగిపోయేదాన్నని తెలిపింది. రాహుల్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాక గొడవ గురించి తనతో చెప్పేదని.. ఎప్పుడూ ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ సతాయించేవాడని.. రాహుల్ చేతిలో ప్రత్యూష దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె గుర్తు చేసుకుంది.

సినిమా, షాపింగ్ లాంటి చిన్న చిన్న కోరికలకు కూడా రాహుల్ ఆమెకు ఆంక్షలు విధించేవాడని రేణు చెబుతోంది. అతని మాజీ గాళ్ ఫ్రెండ్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి దుర్భాషలాడుతుండేదని.. అయినా రాహుల్ తో ప్రత్యూష బంధాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకుందని చెప్పింది. కానీ రాహుల్ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా వాయిదా వేసేవాడని దీంతో ఆమె మానసికంగా కుంగిపోయేదని తెలిపింది. కాగా ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాహుల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ముందస్తు బెయిల్ ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement