ఇంటిలో ఈవీఎం : పోలింగ్‌ అధికారిపై వేటు

Poll Officer Suspended For Carrying Reserve EVM To His Residence - Sakshi

భోపాల్‌ : రిజర్వ్‌ ఈవీఎంను తన ఇంటికి తీసుకువెళ్లిన పోలింగ్‌ అధికారి ఏకే శ్రీవాస్తవను అధికారులు సస్పెండ్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని గుణలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలింగ్‌ అధికారి, సెక్టార్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ శ్రీవాస్తవను సస్పెండ్‌ చేశామని, ఆయన నివాసం నుంచి ఈవీఎంను సీజ్‌ చేశామని ఎస్డీఎం శివాని రక్వార్‌ గార్గ్‌ వెల్లడించారు.

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో ఆదివారం ఆరో దశలో పోలింగ్‌ జరుగుతోంది. గుణలో కాంగ్రెస్‌ దిగ్గజ నేత, సిటింగ్‌ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాతో బీజేపీ అభ్యర్థి కేపీ యాదవ్‌ తలపడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top