ట్రైన్ నుంచి పోలీస్ గెంటివేత | Policeman shot dead on train in Bihar | Sakshi
Sakshi News home page

ట్రైన్ నుంచి పోలీస్ గెంటివేత

Jan 2 2015 11:18 AM | Updated on Sep 28 2018 3:39 PM

ట్రైన్ నుంచి పోలీస్ గెంటివేత - Sakshi

ట్రైన్ నుంచి పోలీస్ గెంటివేత

ఓ రైల్వే పోలీస్ నుంచి కొంతమంది దుండగులు రైళు నుంచి తోసేసిన ఘటన శుక్రవారం ఉదయం దశ్రత్ పూర్ దగ్గర్లో చోటు చేసుకుంది.

పాట్నా: ఓ రైల్వే పోలీస్ నుంచి కొంతమంది దుండగులు రైళు నుంచి తోసేసిన ఘటన శుక్రవారం ఉదయం దశ్రత్ పూర్ దగ్గరలో చోటు చేసుకుంది. ఫరాక్కా ఎక్స్ ప్రెస్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు స్పెషల్ ఆక్సలరీ పోలీసుల తో కొందరు దుండగులు వాగ్వాదానికి దిగారు.ఈ క్రమంలోనే ఆ దుండగులు కదులుతున్న ట్రైన్ లో డోర్ వద్ద ఉన్న కానిస్టేబుల్స్ ను గెంటి వేశారు. దీంతో ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడిక్కడే మృతి చెందాడు.

 

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో పోలీస్ కానిస్టేబుల్ ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పోలీస్ అధికారి ఉమా శంకర్ ప్రసాద్ తెలిపారు.  ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ ట్రైన్ లో ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో వారు భారీగా లూటీకి పాల్పడి పరారయ్యే క్రమంలోనే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement