ఆగిన ‘ముద్దు’ కార్యక్రమం! | Police take into custody 'Kiss Fest' organisers | Sakshi
Sakshi News home page

ఆగిన ‘ముద్దు’ కార్యక్రమం!

Nov 3 2014 12:53 AM | Updated on Sep 2 2017 3:46 PM

ఆగిన ‘ముద్దు’ కార్యక్రమం!

ఆగిన ‘ముద్దు’ కార్యక్రమం!

కేరళలోని కొచ్చి సాగర తీరంలో ఆదివారం జరగాల్సిన ‘ముద్దు (కిస్ ఆఫ్ లవ్)’ అనే కార్యక్రమం పోలీసుల నిర్బంధం కారణంగా ఆగిపోయింది.

కొచ్చి: కేరళలోని కొచ్చి సాగర తీరంలో ఆదివారం జరగాల్సిన ‘ముద్దు (కిస్ ఆఫ్ లవ్)’ అనే కార్యక్రమం పోలీసుల నిర్బంధం కారణంగా ఆగిపోయింది. నిర్వాహకులను పోలీసులు ముందుగానే అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ‘నైతిక పోలీస్’ విధానాన్ని వ్యతిరేకిస్తూ ‘ఫ్రీ థింకర్స్’ అనే ఫేస్‌బుక్ గ్రూపు కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించతలపెట్టింది. యువతీ యువకులు సాగర తీరానికి వచ్చి ఒకర్ని ఒకరు కౌగిలించుకుని, ముద్దాడుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఆదివారం ప్లకార్డులతో లా కాలేజీ నుంచి సాగర తీరంలోని వేదిక వద్దకు నిర్వాహకులు మద్దతు దారులతో వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు సుమారు 30 మందిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు.

 

మీడియా కవరేజీతో వేదిక వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు చేరడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు లాఠీలకు పని చెప్పారు. ఈ సందర్బంగా అభిమానులు ముద్దుల పండుగ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం పలువురిని ఆశ్చర్యపరిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement