పిల్లల చేతికి తుపాకీ | Police Given Revolver To Children In Karnataka | Sakshi
Sakshi News home page

పిల్లల చేతికి తుపాకీ

Feb 11 2019 8:46 AM | Updated on Feb 11 2019 10:27 AM

Police Given Revolver To Children In Karnataka - Sakshi

పిల్లల చేతికి రివాల్వర్‌ ఇస్తున్న దృశ్యం

బెంగళూరు : పట్టణంలోని కొంగాడియప్ప కాలేజ్‌ రోడ్డులో ఉన్న నేషనల్‌ ప్రైడ్‌ స్కూల్‌ నిర్వాహకులు పిల్లలకు పోలీస్‌స్టేషన్‌ను ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశంతో ఆదివారం 50 పైగా పసి పిల్లలను (ఎల్‌కేజీ, యూకేజీ) ఇక్కడి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసికెళ్లారు. ఈ క్రమంలో డీవైఎస్పీ మోహన్‌ కుమార్‌ పిల్లలతో సరదాగా మాట్లాడుతూ... కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తన రివాల్వర్‌ను తెప్పించి అందులో మ్యాగజిన్‌ తీసేసి వట్టి రివాల్వర్‌ను ఒక పాప చేతికివ్వగా, ఆ రివాల్వర్‌ను స్కూల్‌ సిబ్బంది అక్కడున్న పిల్లలందరికీ చేతికిచ్చి తాకించారు.

ఈ వీడియో కాస్త పాఠశాల సిబ్బంది ఫేస్‌బుక్‌లో లైవ్‌ ఇవ్వడంతో డీవైఎస్పీపై కామెంట్ల రూపంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పసి పిల్లల చేతికి రివాల్వర్‌ ఇవ్వడమేంటని, వారి చేతుల్లో ఆయుధాలు పెడితే మనసులపై ఎటువంటి ప్రభావం పడుతుందనే ఆలోచన లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement