క్రూడాయిల్‌ దొంగల ముఠా అరెస్ట్‌ | Police busts gang of oil thieves | Sakshi
Sakshi News home page

క్రూడాయిల్‌ దొంగల ముఠా అరెస్ట్‌

May 19 2017 2:08 PM | Updated on Aug 21 2018 5:51 PM

భూగర్భ పైప్‌లైన్‌ నుంచి క్రూడాయిల్‌ దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

బాలాసోర్‌ : భూగర్భ పైప్‌లైన్‌ నుంచి క్రూడాయిల్‌ దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా రాష్ట్రంలోని పారదీప్‌-హల్దియా భూగర్భ పైప్‌ లైన్‌ నుంచి ముడి చమురు దొంగతనం జరుగుతోంది. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు రూప్సా వద్ద తొమ్మిది మంది సభ్యులు గల ముఠాను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్పీ నితిశేఖర్‌ తెలిపారు. తమకందిన సమాచారం మేరకు ఆయిల్‌ చోరీ జరుగుతున్న ప్రదేశంపై పోలీసులు దాడిచేసి ముఠాను అరెస్టు చేశారన్నారు. ఈ ముఠా సభ్యులు ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, పశ్చిమ బంగ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారని ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement