సైనికులకు మోదీ సెల్యూట్‌ | PM Narendra Modi salutes courage of officers on Army Day | Sakshi
Sakshi News home page

సైనికులకు మోదీ సెల్యూట్‌

Jan 15 2017 10:23 AM | Updated on Aug 15 2018 2:30 PM

సైనికులకు మోదీ సెల్యూట్‌ - Sakshi

సైనికులకు మోదీ సెల్యూట్‌

ఆర్మీ డే సందర్భంగా సైనికులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ: దేశం కోసం ఏ త్యాగానికైనా వెనుకాడని సైనికులను చూస్తే గర్వంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత 69వ ఆర్మీడే సందర్భంగా సైనికులు, వారి కుటుంబాలకు మోదీ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో, విపత్తుల సమయంలో సైన్యం అందించే సేవలను ఈ సందర్భంగా మోదీ కొనియాడారు.

1949 జనవరి 15న భారత తొలి కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ కేఎమ్‌ కరియప్ప నియమితులైన సందర్భానికి గుర్తుగా ప్రతియేటా జనవరి 15న ఆర్మీ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement