పీసీఐ అనుమతి లేకుండా కేసులొద్దు

Plea in SC for mandatory sanction before FIR against journalists - Sakshi

న్యూఢిల్లీ:  ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీసీఐ) లేదా ఇతర జ్యుడీషియరీ అథారిటీ అనుమతి లేకుండా జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం తగదని, ఈ మేరకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ అడ్వొకేట్‌ ఘనశ్యామ్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సంఘ విద్రోహ, జాతి వ్యతిరేక శక్తుల బండారం బయటపెడుతున్న న్యూస్‌ చానళ్లను కొందరు లక్ష్యంగా చేసుకుంటున్నారని, పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి, జీ న్యూస్‌ ఎడిటర్‌ సుధీర్‌ చౌదరిపై ఇలాగే కేసులు పెట్టారని గుర్తుచేశారు. జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటే పీసీఐ అనుమతిని తప్పనిసరి చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top