మరోసారి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు! | Petrol, Diesel Prices Likely to be Cut This Weekend | Sakshi
Sakshi News home page

మరోసారి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు!

Nov 13 2014 4:40 AM | Updated on Sep 28 2018 3:22 PM

మరోసారి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు! - Sakshi

మరోసారి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు!

అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లలో తగ్గుదల కారణంగా ఈ వారాంతానికి దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి తగ్గే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లలో తగ్గుదల కారణంగా ఈ వారాంతానికి దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి తగ్గే అవకాశం ఉంది. ఈ తగ్గుదల రూపాయి వరకూ ఉండవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రేటు తగ్గితే.. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్ విషయంలో ఏడోసారి, డీజిల్‌పై మూడో సారి తగ్గించినట్టవుతుంది. కాగా, ప్రతి 15 రోజులకు రేట్లు సమీక్షించే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు ఈ శనివారం డీజిల్, పెట్రోల్ రేట్లను సవరించనున్నాయి. నవంబర్ 1న పెట్రోల్‌పై రూ. 2.41 తగ్గించడంతో మొత్తంగా ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ రూ. 9.36 తగ్గించినట్టయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement