మళ్లీ పెరిగిన పెట్రో ధరలు | petrol by 83 paise, diesel by Rs 1.23 hike | Sakshi
Sakshi News home page

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

May 17 2016 8:43 AM | Updated on Sep 4 2017 12:14 AM

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఒక లీటర్ పెట్రోల్ పై 83 పైసలు, లీటర్ డీజిల్ ధరను రూ.1.23 పెంచుతున్నట్లు చమురు సంస్థలు మంగళవారం రాత్రి ప్రకటించాయి.

పెట్రోల్‌పై 83 పైసలు, డీజిల్‌పై రూ.1.26

 న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై లీటరుకు 83 పైసలు, డీజిల్‌పై రూ.1.26 పెరిగింది. పెంచిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వెల్లడించింది. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.63.02కు, డీజిల్ ధర రూ.51.67కు పెరిగింది.

ఈ నెలలో ఇదో రెండో పెంపు. మే 1న పెట్రోల్‌పై రూ.1.06, డీజిల్‌పై రూ.2.94 పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల పెంపు, రూపాయి- డాలర్ మారకపు విలువ పెంపుతో పెట్రో ధరలను పెంచినట్లు ఐఓసీ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement