
సాక్షి, భోపాల్ : కేవలం 5 పైసలకే లీటర్ తాగునీటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాడీ మహోత్సవం ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘సముద్ర జలాలను తాగునీరుగా మార్చి తక్కువ ధరకే ప్రజలకు అందిస్తాం. తమిళనాడులోని ట్యూటికోరన్‌లో ఇందుకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు నది జలాల పంపిణీపై పోరాడుతుంటాయి. కానీ ఎవ్వరు కూడా భారత్ నుంచి పాకిస్తాన్‌కు తరలిపోతున్న నది జలాల గురించి మాట్లాడర’ని ఆయన అన్నారు.