కరోనా: గొప్ప స్ఫూర్తినిచ్చే వీడియో ఇది! | People Applaud Sanitation Worker And Garland Him In Punjab | Sakshi
Sakshi News home page

కరోనా: కార్మికుడిపై పూల వర్షం.. నోట్ల దండలు!

Apr 1 2020 9:29 AM | Updated on Apr 1 2020 1:07 PM

People Applaud Sanitation Worker And Garland Him In Punjab - Sakshi

నిముషం పాటు ఉన్న ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

చండీగఢ్‌: పంజాబ్‌లోని పటియాల జిల్లా నభా ప్రాంత ప్రజలు ఆదర్శంగా నిలిచారు. కరోనా భయాలు.. లాక్‌డౌన్‌ నేపథ్యంలోనూ క్రమం తప్పకుండా చెత్త సేకరిస్తున్న పారిశుధ్య కార్మికుడికి చప్పట్లతో స్వాగతం పలికిన ఓ కాలనీవాసులు.. అతనిపై పూల వర్షం కురిపించి కృతజ్ఞతలు తెలిపారు. దాంతో పాటు కరెన్సీ నోట్ల దండలు అతని మెడలో వేసి ఘనంగా సత్కరించారు. నిముషం పాటు ఉన్న ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఇక భారత్‌ వ్యాప్తంగా 1361 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వారిలో 123 మంది కోలుకున్నారు. 35 మంది మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement