జమ్మూకశ్మీర్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పీడీపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశమున్నా, మెజార్టీ దరిదాపులకు కూడా వెళ్లలేకపోతోంది. 87 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో పీడీపీ 28, బీజేపీ 25, కాంగ్రెస్ 15, ఎన్సీ 13 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
పీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ అనంతనాగ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాగా కశ్మీర్ ఫలితాల సరళి ఎప్పటికప్పుడు మారుతోంది. ఉదయం పీడీపీ ముందంజలో ఉండగా, ఆ తర్వాత బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్లింది. అనంతరం ఇరు పార్టీలు నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డాయి. ప్రస్తుతం పీడీపీ మళ్లీ ముందంజలో ఉంది.