జమ్ముకాశ్మీర్ లో పాక్ మరోసారి కాల్పులు | Pakistan army violates LoC ceasefire again in Jammu | Sakshi
Sakshi News home page

జమ్ముకాశ్మీర్ లో పాక్ మరోసారి కాల్పులు

Aug 19 2015 9:08 AM | Updated on Sep 3 2017 7:44 AM

సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద, జమ్ముకాశ్మీర్ లోని మరికొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది.

జమ్ముకాశ్మీర్ : సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద, జమ్ముకాశ్మీర్ లోని మరికొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. పూంచ్ జిల్లాలో పాక్ సైన్యం కాల్పులు జరిపిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీష్ మెహతా వెల్లడించారు. బాలాకోట్ ప్రాంతంలో కాల్పులు ప్రారంభించగానే మన సైన్యం ఎదురు దాడికి దిగగానే రాత్రి పది గంటల సమయంలో పాక్ కాల్పులు విరమించినట్లు తెలిపారు. కానీ పూంచ్ జిల్లాలో మాత్రం కొద్దిసేపు కాల్పులు ఆపి మళ్లీ రాత్రి 10 గంటల నుంచి 10:30 వరకు కొనసాగించారని మెహతా చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement