విపక్ష పార్టీల తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా గోపాలకృష్ణ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ: విపక్ష పార్టీల తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా గోపాలకృష్ణ గాంధీ మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆయన వెంట వచ్చారు. రాజ్యసభ కార్యదర్శికి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి. రాజా, జేడీ(యూ) నేత శరద్ యాదవ్ తదితర ప్రముఖులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. 18 ప్రతిపక్ష పార్టీలు గోపాలకృష్ణ గాంధీకి మద్దతు ఇచ్చాయి.
అంతకుముందు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. వీరిద్దరూ పోటీలో నిలబడడంతో పోలింగ్ అనివార్యమైంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 21 చివరి తేది.