
భూ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గళం విప్పనున్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గళం విప్పనున్నారు. ఈ నెల 22న ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్వహించే సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఆయన ప్రసంగించనున్నారు. అంతేగాకుండా పార్లమెంట్ వరకూ నిర్వహించే నిరసన ప్రదర్శనకు ఆయన నేతృత్వం వహించే అవకాశం కూడా ఉంది. అయితే తుది కార్యక్రమానికి సంబంధించి మరింత కసరత్తు జరుగుతోందని సభకు సంబంధించిన వివరాలు వెల్లడించిన ఆప్ ప్రతినిధి ఒకరు శుక్రవారం ఇక్కడ తెలిపారు. ఆ బిల్లుకు వ్యతిరేకంగా మార్చ్ నిర్వహించాలని గత నెలజరిగిన ఆ పార్టీ జాతీయ మండలి భేటీలో నిర్ణయించడం తెలిసిందే.