'15 వరకు జోక్యం చేసుకోం' | Odd-Even Scheme To Continue Till Jan 15, Says Delhi High Court | Sakshi
Sakshi News home page

'15 వరకు జోక్యం చేసుకోం'

Jan 11 2016 11:37 AM | Updated on Sep 3 2017 3:29 PM

'15 వరకు జోక్యం చేసుకోం'

'15 వరకు జోక్యం చేసుకోం'

ఢిల్లీ రహదారులపైకి సరి-భేసి విధానంతో మాత్రమే వాహనాలకు అనుమతిస్తామని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తాము జోక్యం చేసుకోబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది

న్యూఢిల్లీ: ఢిల్లీ రహదారులపైకి సరి-భేసి విధానంతో మాత్రమే వాహనాలకు అనుమతిస్తామని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తాము జోక్యం చేసుకోబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం పేర్కొన్నట్లుగా ఈ నెల 15వరకు(శుక్రవారం) ఆ నోటిఫికేషన్ ప్రకారమే అమలవుతుందని, దానిని మధ్యలో ఆపలేమని చెప్పింది.

దీనిపై తుది తీర్పును మాత్రం నేరుగా వెల్లడించకుండా శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే, ఫిబ్రవరి 15 నుంచి ప్రవేశ పెట్టనున్న కొత్త ట్రాఫిక్ నిబంధనలను వ్యతిరేకిస్తూ కోర్టుకు వచ్చిన నోటీసులపై మాత్రం విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement