
ప్రధానికి ఒబామా ఆహ్వానం
అమెరికాలో పర్యటించాల్సిందిగా ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రధాని నరేంద్ర మోడీని లాంఛనంగా ఆహ్వానించారు. 21వ శతాబ్దంలో ద్వైపాక్షిక సంబంధాలను ఓ నిర్వచనీయ భాగస్వామ్యంగా తీర్చిదిద్దేందుకు వీలుగా మోడీతో కలిసి పనిచేయడంపై ఒబామా ఆసక్తిని వ్యక్తం చేశారు.
ఫలవంతమైన పర్యటన కోసం
ఎదురుచూస్తున్నానన్న మోడీ
సెప్టెంబర్‌లో అమెరికా పర్యటన
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికాలో పర్యటించాల్సిందిగా ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రధాని నరేంద్ర మోడీని లాంఛనంగా ఆహ్వానించారు. 21వ శతాబ్దంలో ద్వైపాక్షిక సంబంధాలను ఓ నిర్వచనీయ భాగస్వామ్యంగా తీర్చిదిద్దేందుకు వీలుగా మోడీతో కలిసి పనిచేయడంపై ఒబామా ఆసక్తిని వ్యక్తం చేశారు. తనను ఆహ్వానించినందుకు ఒబామాకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. నిర్దిష్ట ఫలితాలతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపును, శక్తినీ ఇచ్చే ఫలభరితమైన పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్టు మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. న్యూయూర్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లాల్సి ఉంది. ఒబామా ఆహ్వానం నేపథ్యంలో ఆయనతో భేటీ నిమిత్తం మోడీ వాషింగ్టన్‌కు వెళతారు. ఒబామా ఆహ్వాన లేఖను శుక్రవారం మోడీతో భేటీ సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి విలయం బర్న్స్ ఆయనకు అందజేశారు. సెప్టెంబర్‌లో వాషింగ్టన్‌ను సందర్శించాలన్న తన ఆహ్వానాన్ని ఒబామా ఆ లేఖలో పునరుద్ఘాటించినట్లు ప్రధాని కార్యాలయం (పీఎంఓ) శుక్రవారం నాటి ప్రకటన వెల్లడించింది. భారత్, అమెరికాల మధ్య భాగస్వామ్యాన్ని తిరిగి బలోపేతం చేయడం ప్రపంచానికి కీలక సందేశాన్నిస్తుందనే అభిప్రాయంతో ప్రధాని ఉన్నట్టు పీఎంఓ పేర్కొంది.
ఘన స్వాగతానికి భారతీయుల సన్నాహాలు
సెప్టెంబర్‌లో అమెరికా రానున్న ప్రధానికి అక్కడి భారతీయులు ఘన స్వాగతం పలుకనున్నారు. 60 వేల మంది నుంచి 80 వేల మందికి సరిపడే వేదికను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యూరు. న్యూయూర్క్‌లోని ప్రముఖ యూంకీ స్టేడియంతో పాటు న్యూజెర్సీలో మంచి పేరున్న జెరుుంట్స్ స్టేడియంను బుక్ చేశారు.