నీట్‌ పరీక్ష రద్దు అవాస్తవం: ఎన్‌టీఏ

NTA Clears Rumors Regarding NEET Exam - Sakshi

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)‌ పరీక్షలు రద్దవుతాయని వస్తున్న వార్తలు అవాస్తవమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. నీట్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న నిరాధార వార్తను నమ్మవద్దని ఎన్‌టీఏ ఓ ప్రకటన విడుదల చేసింది. 2020, జులై 26న నీట్‌ పరీక్ష ఉంటుందని గతంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, నీట్‌ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు జూన్‌ నెల 15 వ తేదీన నిరాధార వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు.

కాగా విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే నిరాధార వార్తపై  విచారణ జరుపుతామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అయితే, నీట్‌ పరీక్షలకు సంబంధించి మే 11, 2020న విడుదల చేసిన ప్రకటన ప్రామాణికమని ఎన్‌టీఏ తెలిపింది. సరైన సమాచారం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు(www.nta.ac.inand ntaneet.nic.in) ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది. వైద్య విద్య ప్రవేశాల కోసం ఎన్‌టీఏ నీట్‌ పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  (చదవండి: నీట్‌’గా దొరికిపోతున్నారు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top