
రాష్ట్రపతి పదవికి పోటీ చేయను!
రాష్ట్రపతి పదవికి పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని కాంగ్రెస్ నాయకుడు శరద్ పవార్ అన్నారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని కాంగ్రెస్ నాయకుడు శరద్ పవార్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్‌సీపీల తరఫు నుంచి ప్రతిపక్ష అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని శరద్‌కు అభ్యర్ధన వచ్చినట్లు ఎన్‌సీపీ అధికార ప్రతినధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన శరద్ తనకు రాష్ట్రపతి పదవికి పోటీ చేసే ఉద్దేశం లేదని.. అందుకు వేరే వ్యక్తిని చూసుకోవాలని కోరారు.
పోటీకి తగిన బలం లేకుండా వెళ్లి ఓడిపోవడం ఇష్టం లేకనే పవార్ ఈ అవకాశాన్ని తిరస్కరించారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ చెప్పారు. అధికార ఎన్‌డీఏకు 48 శాతం ఓట్లు ఉన్నాయని.. తాజా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కూడా మద్దతు ఇస్తున్నట్లు చెప్పడంతో ఆ పార్టీ విజయం ఖాయమని అన్నారు.