అందుకే మహిళలు వెనకబడుతున్నారట | Non-family support hinders stable career for women: Survey | Sakshi
Sakshi News home page

అందుకే మహిళలు వెనకబడుతున్నారట

Mar 12 2015 9:15 PM | Updated on Sep 2 2017 10:43 PM

ముంబై: కుటుంబేతర మద్దతు లేకే మహిళలు వెనకపడిపోతున్నారని, వారు అభివృద్ధిలో పురుషుల కన్నా వెనుకంజలో ఉన్నారని ఓ సర్వే తేల్చింది.

ముంబై: కుటుంబేతర మద్దతు లేకే మహిళలు వెనకపడిపోతున్నారని, వారు అభివృద్ధిలో పురుషుల కన్నా వెనుకంజలో ఉన్నారని ఓ సర్వే తేల్చింది. మధ్యవయసుకు వచ్చే సరికి వారికి కేవలం 20శాతం మద్దతు మాత్రమే లభిస్తుందని పేర్కొంది. ఫ్లెక్సీ కెరీర్స్ ఇండియా అనే  సోషల్ ఎంటర్ ప్రైజ్ సంస్ధ మొత్తం 2,456 మందిని తమ సర్వేలో భాగంగా ప్రశ్నించగా ఈ విషయం వెల్లడైందని వివరించింది.

 

కుటుంబేతర మద్దతు విషయంలో పురుషులు బాగా ముందున్నారని, వారికి కెరీర్ ప్రారంభంలో 46శాతం, కెరీర్ మధ్యలో 55శాతం, బాగా పరిణతి చెందిన తర్వాత 57శాతం మద్దతు లభిస్తుండగా.. మహిళలకు మాత్రం పురుషులతో పోలిస్తే 35శాతం తక్కువ సపోర్ట్ లభిస్తుందని ఆ సంస్థ తేల్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement