భార్యను రేప్ చేసి బంగారం ఎత్తుకెళ్లాడు | Noida: Man held for raping, robbing wife in Sector 120 | Sakshi
Sakshi News home page

భార్యను రేప్ చేసి బంగారం ఎత్తుకెళ్లాడు

Aug 11 2016 12:56 PM | Updated on Aug 30 2018 5:24 PM

భార్యను రేప్ చేసి బంగారం ఎత్తుకెళ్లాడు - Sakshi

భార్యను రేప్ చేసి బంగారం ఎత్తుకెళ్లాడు

భార్యపై అత్యాచారానికి పాల్పడి, బంగారం ఎత్తుకుపోయిన వ్యక్తిని నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు.

నోయిడా: భార్యపై అత్యాచారానికి పాల్పడి, బంగారం ఎత్తుకుపోయిన వ్యక్తిని నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. నగరం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. తనపై అత్యాచారానికి పాల్పడి, బంగారపు గొలుసు తీసుకుని పారిపోయాడని నిందితుడి భార్య ఆదివారం పార్థల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బిహార్ కు చెందిన తాను ఉద్యోగం కోసం నోయిడా వచ్చానని, 2013లో నిందితుడితో పరిచయమైందని వెల్లడించింది. తామిద్దం ప్రేమించుకుని తర్వాత పెళ్లి చేసుకున్నామని బాధితురాలు తెలిపింది.

ఏడాదిన్నర పాటు సహజీవనం చేసిన తర్వాత వీరిద్దరూ స్థానిక కోర్టులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని సెక్టార్ 120 ఫేజ్ 3 పోలీస్ స్టేషన్ అధికారి పంకజ్ పంత్ చెప్పారు. పెళ్లైన కొద్ది రోజులకే తరచూ గొడవ పడుతుండే వారని, గతవారం బాధితురాలి బంగారపు గొలుసు తీసుకుని నిందితుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. ఇంటి తిరిగి వచ్చేందుకు, గొలుసు ఇచ్చేందుకు నిరాకరించడంతో అతడిపై బాధితురాలు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టడీకి పంపినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement