ఏ కోర్టూ నన్నేమీ చేయలేదు: నిత్యానంద | No Stupid Court Can Prosecute Me Im Param Shiva says Nithyananda | Sakshi
Sakshi News home page

ఏ కోర్టూ నన్నేమీ చేయలేదు: నిత్యానంద

Dec 10 2019 3:42 AM | Updated on Dec 10 2019 3:42 AM

No Stupid Court Can Prosecute Me Im Param Shiva says Nithyananda - Sakshi

న్యూఢిల్లీ: అత్యాచారం ఆరోపణలతో దేశం వదిలి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి రెచ్చి పోయారు. ఏ వెదవ కోర్టూ తనను ఏమీ చేయలేదని, తానే పరమశివుడినని వ్యాఖ్యానించారు. గుర్తు తెలియని ప్రాంతం నుంచి విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘నన్నెవరూ ముట్టుకోలేరు. నేను మీకు నిజం చెబుతా. నేనే పరమ శివుడిని. అర్థమైందా? ఈ నిజాన్ని ప్రకటించినందుకు ఏ వెదవ కోర్టూ నన్ను విచారిం చలేదు. నేనే పరమశివుడిని. నాదీ గ్యారెంటీ. మీకెవరికీ మరణం లేదు’అంటూ నిత్యానంద వ్యాఖ్యానించడం వీడియోలో కనిపించింది. ఇదిలా ఉండగా దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతిని రవీశ్‌కుమార్‌ మాట్లాడుతూ అన్ని దేశాల్లోని కార్యాలయాలను అప్రమత్తం చేశామని, నిత్యానంద గురించి స్థానిక ప్రభుత్వాలకు వివరించాలని స్పష్టం చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement